A Monkey Who Behaves Strangely After Drinking Alcohol

న్యూ ఇయర్ వేళ మందు కొట్టి… ఫుల్‌ కిక్కెక్కి… కోతి ఏం చేసిందో చూడండి! ( వీడియో)

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మనుషులే కాదు, జంతువులు కూడా చేసుకుంటాయి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ… కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ… మత్తులో మునిగి పోయింది ఓ వానరం. 

‘మందు కొడితే ఆ కిక్కే వేరప్పా’ అనుకుందో ఏమో మరి న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఓ కోతి ఫుల్ గా తాగేసింది. ఆ తర్వాత బాగా  కిక్కెక్కి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఆ కోతి వేసిన చిందులు చూస్తే ఎలాంటి వారైనా సరే నవ్వాపుకోలేరు.

ఫారెస్ట్ ఏరియాలో ఓ కోతికి ఆల్కహాల్ బాటిల్ దొరికింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ గా లాగించేసింది. తర్వాత మెల్లిగా కోతికి హ్యాంగోవర్ అయింది. ఇప్పట్లో నిషా దిగేలా లేదు. ఇంకేముంది తన రెండు కాళ్లు పైకెత్తి…  చేతులతో నడుస్తూ… భీబత్సం సృష్టించింది. 

ఈ ఫన్నీ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన సుశాంతా నందా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాదు, న్యూఇయర్ వేళ సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి మరి అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కోతి పడే అవస్థలు చూడలేక… నవ్వాపుకోలేక  పోతున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top