Akhanda Title Song Promo Out

అఖండ సాంగ్ ప్రోమో: నటసింహం గర్జనకి షేక్ అయిన యూట్యూబ్

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. అఖండ మూవీ నుంచీ ప్రోమో రిలీజైంది. నట సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్ లో రాబోవు చిత్రం అఖండ.

ఇప్పటికే బాలయ్య కెరీర్‌లో సింహ, లెజెండ్‌‌ వంటి సినిమాలతో హ్యాట్రిక్ అందించిన బోయపాటి… తాజాగా ఇప్పుడు మరో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడుతున్నాడు. ఈ కారణంగానే చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. 

గతంలో ఏ హీరో కూడా చేయలేని సాహసాన్ని ఇప్పుడు బాలయ్యతో చేయిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్యని అఘోరాగా పరిచయం చేయబోతున్నాడు. బాలయ్య ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకొని… ఆయన్ని ఒక పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు. 

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఈ కారణంగానే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక దీపావళి సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఈ మూవీ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. “భమ్ భమ్ అఖండ…” అంటూ సాగే ఈ సాంగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అది ఎంతలా అంటే… విడుదలై 24 గంటలు కూడా గడవకముందే… 2 మిలియన్ కి పైగా వ్యూస్ రాబట్టింది. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని ఈనెల 8తేదీన విడుదల చేయనున్నారు. 

ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై… మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ డ్యుయల్ రోల్ పోషిస్తుండగా… ఆయన సరసన ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top