Virat Kohli Danced on the Field to a Song Called ‘My Name is Lakhan’

విరాట్ కోహ్లీ మైదానంలో చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది (వీడియో)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన పని చేస్తూ… నెట్టింట్లో సందడి చేస్తుంటాడు. ఒక్కోసారి బ్యాటింగ్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తే… ఇంకోసారి ఫీల్డ్ లోనే తెగ ఎమోషన్ అయిపోతాడు. సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు జరిగింది. 

ఈసారి కోహ్లీ తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా… బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ పాడిన ‘మై నేమ్ ఈజ్ లఖన్’ అనే ఫేమస్ సాంగ్ స్టేడియంలో ప్లే అయ్యింది.  ఇంతలో విరాట్ కోహ్లి ఫీల్డింగ్ కోసం బౌండరీ లైన్ దగ్గరకి వచ్చాడు. ఇకేముంది ఆ సాంగ్ వింటూ మైమరచిపోయి…  మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. 

దీనికి సంబందించిన వీడియో ఒకటి బయటకి రిలీజయిది. ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్లతో రెచ్చిపోయారు. అయితే, విరాట్ మైదానంలో ఇలా డ్యాన్స్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఆయన ఇలా డాన్స్ చేశారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top