పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే! తల్లి రేణూ దేశాయ్ అకీరా యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటారు. అకీరాకి కేవలం చదువులోనే కాకుండా… మ్యూజిక్, గేమ్స్ వంటి విషయాల్లో మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా పియానో ప్లే చేయటంలో మంచి దిట్ట.
ఇక రీసెంట్ గా అకీరా తన ఫ్రెండ్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాటకి తన స్టైల్లో పియానో ప్లే చేశాడు. అది కూడా మరెక్కడో కాదు, తన స్కూల్ ఫంక్షన్లో.
ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అకీరా త్వరలోనే కాలేజి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 15 సంవత్సరాల స్కూల్ లైఫ్ కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ ఈవెంట్ ని నిర్వహించి… ప్రతి స్టూడెంట్ కి వారి పేరెంట్స్ సమక్షంలో సర్టిఫికెట్స్ అందజేసింది స్కూల్ మేనేజ్మెంట్.
నర్సరీ నుంచి ప్లస్ 2 వరకు ఇక్కడే చదివిన అకీరా… తన స్కూల్ గ్రాడ్యూయేషన్ ఫంక్షన్ లో… తన ఫ్రెండ్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘దోస్తీ’ సాంగ్ ని పియానో పై ప్లే చేశాడు. ఆ సమయంలో తన కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోయారు పవన్ కళ్యాణ్. ఈ వీడియోని రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… ఇప్పుడది తెగ వైరల్ అయ్యింది.