మరణం అనేది ప్రతి ఒక్కరికీ సహజమే! పుట్టిన ప్రతి వ్యక్తీ మరణించక తప్పదు. అయితే, మనం మరణానికి సమీపిస్తున్నామని ఎలా తెలుస్తుంది? మరణించటానికి కొద్దిసేపటి ముందు ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఏమేమి కనిపిస్తాయి? ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికీ మిస్టరీగానే ఉంటూ వస్తున్నాయి. కానీ, ఈ విషయాలపై ఎన్నో రిసర్చ్ లు చేసిన తర్వాత ముఖ్యంగా మరణం సమీపించే ముందు మనిషిలో 5 దశలు ఏర్పడతాయని తేలింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటి దశ-
మరణం సమీపిస్తున్నప్పుడు మొదటి దశలో వ్యక్తి ఏమీ వినలేడు. చాలా ప్రశాంతతని అనుభూతి చెందుతాడు. అప్పుడే అతనికి భయం, టెన్షన్, కష్టాలు వంటివన్నీ మొదలవుతాయి.
రెండో దశ-
రెండో దశలో వ్యక్తి శరీరంలో గుండా కాంతి ప్రసరిస్తుంది. దీనిని ఆ వ్యక్తి పూర్తిగా అనుభవిస్తాడు. సరిగ్గా అదే సమయంలో తాను గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది.
మూడవ దశ-
మొదటి రెండు దశలూ దాటిన తర్వాత మూడవ దశలో పూర్తిగా రిలాక్స్ అవుతాడు. ఇక కొంతమందికైతే ఈ దశలో భయానక జీవులు కనిపించటం, గగుర్పాటు కలిగించే శబ్దాలు వినటం, విపరీతమైన దుర్వాసన రావటం వంటివి కలుగుతాయి.
నాల్గవ దశ-
నాల్గవ దశలో వ్యక్తి అకస్మాత్తుగా విపరీతమైన కాంతిని చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత అది క్రమంగా చీకటిగా మారి, పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతాడు.
ఐదవ దశ-
ఐదవ దశలో ఫైనల్ గా వ్యక్తి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. దీంతో అతను చనిపోతాడు.
ప్రతి వ్యక్తి జీవితంలో మరణం సమీపించే ముందు పైన తెలిపిన ఈ 5 దశలని తప్పక దాటతారు. ఆ తర్వాత మరణం సమీపిస్తుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం.