స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైట్… రీజన్ తెలిస్తే షాక్..! (వీడియో)

బెంగుళూరులో స్కూల్ గర్ల్స్ మద్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. అది ఎంతలా అంటే… హాకీ కర్రలతో కొట్టుకోనేంతలా. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు బెంగుళూరు సిటీలోని సెయింట్ మార్క్స్ రోడ్డుపై. ఇంతకీ ఆ స్టూడెంట్స్ అంతలా దాడికి దిగటానికి కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు.

కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై బిషప్ కాన్వెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ ఓన్లీ గర్ల్స్ స్కూల్. అయితే ఈ స్కూల్ కి చెందిన కొంతమంది స్టూడెంట్స్ రెండు వర్గాలుగా విడిపోయి… స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న రోడ్డుపై వచ్చి చేరారు. వాళ్ళలో ఒక గ్యాంగ్ స్కూల్ యూనిఫామ్ లో ఉండగా… మరో గ్యాంగ్ మాత్రం క్యాజువల్ డ్రెస్ లో ఉంది. 

ముందు మాటలతో మొదలైన వేరి సంభాషణ చివరికి మాటా మాటా పెరిగి కొట్టుకోవటం దాకా వెళ్ళింది. సుమారు 20 మందికి పైగా బాలికలు ఆ స్కూల్ ముందే కొట్టుకో సాగారు. వాళ్ళంతా కలిసి నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకోవటం, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవటం చేశారు. ఇంకా హాకీ కర్రలు తీసుకొని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం సడెన్ గా వేడెక్కింది. 

అసలే రద్దీగా ఉండే రోడ్డు. రోడ్డు సైడ్స్ లో కార్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. వాటి మద్యలో ఈ గ్యాంగ్ వార్ జరిగింది. వీరి అరుపులు విని స్థానికులు పరిగెత్తుకు రావటంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

ఇదంతా జరిగింది ఎందుకో తెలుసా..! కేవలం ఒక అబ్బాయి కోసం. ఓకే ఒక్క అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు తమ బ్యాచిలతో సహా వచ్చి నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. ఇంతా చేసి వీళ్ళు చేసిన పనికి స్కూల్ యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుండా అంటే… అదీ లేదు. ఏదేమైనా ఆడుతూ… పాడుతూ… చదువుకోవాల్సిన వయసులో కక్షలూ… కార్పణ్యాలూ… అంటూ రగిలిపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

 

View this post on Instagram

 

A post shared by Times Now (@timesnow)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top