భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో)

భార్యాభర్తల మద్య గొడవలు స‌ర్వ‌సాదార‌ణం. కానీ ఇటీవల ఆ గొడవలు అనేక అనర్దాలకి దారి తీస్తున్నాయి. ఒకరినొకరు చంపుకోవటం, లేదంటే ఎవరికి వారు ఆత్మహత్యలు చేసుకొనే వరకూ వెళ్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈసారి ఆ భర్త ఏం చేశాడో తెలుసా!

ముంబైకి సమీపంలో ఉన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్‌ లో 5వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌ పై  ఒక ఫ్యామిలీ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే అది తెల్లవారు ఝాముకావటంతో… తన ఇద్దరు పిల్లలతో కలిసి బెంచీపై నిద్రిస్తూ ఉంది ఆ మహిళ. ఆమె భర్త మాత్రం ప్లాట్‌ఫారమ్‌ పై అటూ… ఇటూ… తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో కొద్ది దూరంలో రైలు కూత వినిపించటంతో… హడావిడిగా భార్యని నిద్ర లేపాడు.

కొద్దిసేపు ఇద్దరూ ఏదో వాదనలాడుకున్నారు. తర్వాత పట్టాలపైకి వేగంగా అవధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రావటం గమనించి… బలవంతంగా భార్యను పట్టాల వైపుకు ఈడ్చుకెళ్లి… రైల్వే ట్రాక్ పైకి విసిరేశాడు ఆ భర్త. తర్వాత ప్లాట్‌ఫారమ్‌ బెంచీపై నిద్రిస్తున్న తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని అక్కడినుండీ పారిపోయాడు. 

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

ఇదంతా అక్క‌డ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నిజానికి ఆ భార్యాభర్తలు ఆరోజు ఉదయం నుంచి వసాయ్ రోడ్ స్టేషన్‌లో తిరుగుతున్నట్లు వసాయ్ ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం అయ్యేసరికి  వారి మధ్య గొడవలు జరగడంతో ఆ మహిళ ఓ క్లీనర్ సెల్‌ఫోన్‌ను తీసుకుని ఏదో ఒక నంబర్‌కు డయల్ చేసింది. 

ఇక రోజంతా వారు ఆ ప్లాట్‌ఫారమ్‌పైనే గడిపారు. అర్థరాత్రి కావటంతో వారు నిద్రపోయారు. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కోసం నిందితుడు కొద్దిసేపు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో ట్రైన్ రాగానే భార్యని వదిలించేసుకున్నాడు. అతను మాత్రం ఏమీ ఎరగనట్లు పిల్లలను తీసుకొని రైలెక్కి వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో అతని భార్య అక్కడికక్కడే చనిపోయింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top