ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో)

అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెందుతాయో… ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో… ఎవరికీ తెలియదు. ఒక్కసారి అగ్నిపర్వతం బధ్ధల్లై… లావా వెదజల్లటం మొదలైందో… అది ఎంత దూరం వెళుతుందో! ఎప్పటికి చల్లారుతుందో! ఊహించలేం.

నిజానికి ఈ వాల్కెనోస్ అనేవి వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఇవి ఎక్స్ ప్లోడ్ అయినప్పుడు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకూ లావా ప్రవహిస్తుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలోని వాతావరణం మొత్తం బూడిదతో నిండిపోయి… పొల్యూట్ అయి ఉంటుంది. అందుకే, దాని దరిదాపుల్లో ఎలాంటి ప్రాణి కూడా సంచరించకూడదు. 

ప్రపంచవ్యాప్తంగా వందలాది అగ్నిపర్వతాలు ఉన్నాయి. అయితే వాటిల్లో అన్నీ కాకపోయినా… కొన్ని మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి. అవి ఎముకలను సైతం క్షణాల్లోనే కరిగించగలవు. అలాంటి ఓ వాల్కెనో ఎటువంటి కదలికలు లేకుండా… ప్రకృతిలో లీనమై ఉంది.అలాంటి ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని సైతం రగిలించారు. 

ఒకపక్క అగ్ని పర్వతం ప్రశాంతంగా ఉంది అంటూనే… మళ్ళీ మంటలు రావటం ఏంటి? అని మీకు డౌట్ రావచ్చు.  ఇప్పటివరకూ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు దాని దరిదాపుల్లో ఉండి బతికి బయట పడిన వారిని చూశాం. అలానే, లావా ప్రవహిస్తున్నప్పుడు దానిని దగ్గరనుండీ వీడియో తీసిన వారిని చూశాం. కానీ, నిద్రిస్తున్న అగ్ని పర్వతాన్ని నిద్ర లేపిన వారిని మాత్రం ఇప్పటివరకూ చూడలేదు. ఇంతకీ ఏం చేశారనే కదా మీ డౌట్.

చుట్టూ ఎత్తైన కొండల మద్య ఓ లోయలో ఒక అగ్ని పర్వతం ప్రశాంతంగా ఉంది. వాస్తవానికి అది అగ్ని పర్వతం అని ఎవరూ అనుకోరు. ఈ విషయం తెలిసో… తెలియకో… ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఎత్తైన కొండపై నిలబడి ఓ చిన్న రాయిని ఆ లోయలోకి విసిరారు. రాయి కింద పడగానే పొగలు గక్కుతూ… లావా పైకి చిమ్మడం ప్రారంభమయింది. 

మెల్లిగా మొదలైన ఆ మంట… క్రమక్రమంగా నిప్పు రాజేస్తూ… పెరిగి పెద్దదై… లావాని బయటికి చిమ్మటం మొదలుపెట్టింది. పెద్దగా విధ్వంసం సృష్టించకపోయినా… ఓ మోస్తరుగా   నిప్పులు చిమ్ముతూ… కనిపించింది. ఇదంతా చూస్తే,    మనికి ఓ పాత సామెత గుర్తొస్తుంది. “నిద్ర పోయే గాడిదను లేపి తన్నించుకున్నట్లు” అని పెద్దలు ఊరికే అనలేదేమో!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top