ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

0
21
RTC Bus Hits Traffic CI

ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ నిత్యం వేలాది వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎండా, వాన ఇలాంటివేమీ  లెక్క చేయకుండా నడిరోడ్డుపై నిల్చుని… వాహనాల మధ్యలో… ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి ఆ ట్రాఫిక్ పోలీసే ట్రాఫిక్ లో ఇరుక్కొని ప్రమాదంలో పడితే..! సరిగ్గా ఇదే జరిగింది వైజాగ్ లో.

వైజాగ్ గాజువాక జంక్షన్‌ లో ఎప్పటిలానే విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డి.  ట్రాఫిక్ కంట్రోల్ నేపధ్యంలో ఎదురుగా ఉన్న ఒక ఆర్టీసీ బస్సును డైవర్ట్ చేస్తుండగా… అది రైట్ టర్న్ తీసుకుంరటూ ఉంది. ఇంతలో వెనుకనుండీ మరో ఆర్టీసీ బస్సు వచ్చి సత్యనారాయణరెడ్డిని ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామానికి ఆయన గబుక్కున కింద పడిపోయారు. కొద్దిపాటి గాయాలు కావడంతో… సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here