Wednesday, October 5, 2022
spot_img

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. 

ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ కి చెందిన ముగ్గురు గర్ల్స్‌ ఒకరికొకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది.  ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ముగ్గురు గర్ల్స్‌ మద్య ఫైటింగ్‌ జరిగింది. వీళ్ళు ముగ్గురిలో ఏ ఒక్కరూ కూడా ఎంతమాత్రం తగ్గట్లేదు. తమ తోటి విద్యార్ధులు వీరిని విడిపించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లా జుట్లు వదల్లేదు. ఇదంతా క్లాస్ రూమ్ లో ఉన్న ఒక విద్యార్ధి వీడియో తీశారు. 

ఈ వీడియోలో అమ్మాయిలు ముగ్గురూ స్కూల్ డ్రెస్ లో ఉన్నారు. క్లాస్ రూమ్ లో బెంచీల మద్య కుమ్మేసుకున్నారు.  ముందుగా ఒకరి జట్టు మరొకరు పట్టుకున్నారు. తర్వాత చేతులతో కొట్టుకున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. వీరిని వారించటం అక్కడున్న వారెవరి తరం కాలేదు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,513FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles