ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో)

మనకి ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకు పోతున ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా . సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో కొత్తగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను మన ముందుకు తీసుకురాబోతుంది. అదే అన్యాస్‌ ట్యుటోరియల్‌. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న ‘అర్కా మీడియా వర్క్స్‌’ ఈ సిరీస్‌ను నిర్మించగా పల్లవి గంగి రెడ్డి దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ జులై 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సిరీస్‌పై మాట్లాడారు. ఇది తన తొలి తమిళ వెబ్‌ సిరీస్‌ అని, ఆహాతో కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సిరీస్‌లో రెజీనా, నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హర్రర్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని నిర్మాతుల చెబుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top