అవతార్ 2: ‘ది వే అఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్‌

లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్ ​సృష్టించిన గ్రేట్ విజువల్ వండర్ ‘అవతార్’.  2009లో వచ్చిన ​ఈ హాలీవుడ్ మూవీకి అనేక ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. పండోరా గ్రహవాసులకి చెందిన స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 

సాదారణంగా హాలీవుడ్ లో కంటెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో… టెక్నాలజీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అటు కంటెంట్… ఇటు టెక్నాలజీ… ఇలా రెండిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన మూవీ అవతార్. అందుకే అంతలా హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా వచ్చి పుష్కర కాలం గడిచినప్పటికీ, ఇప్పటికీ దీనిపై క్రేజ్ తగ్గలేదు. అందుకే ఈ చిత్రాన్ని 3 పార్ట్స్ గా అందించాలని అనుకున్నారు.

అందులో భాగంగానే, అవతార్ కి సీక్వెల్ గా ‘అవతార్-2’ ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు. అయితే, అవ‌తార్‌లో భూమి కోసం పోరాటం చేస్తే, అవ‌తార్ – 2లో నీటి కోసం యుద్ధం చేస్తారు. అందుకే ఈ మూవీ టైటిల్ ని ‘అవతార్: ది వే ఆఫ్​ వాటర్’ అని పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా మొత్తం 160 భాషల్లో రిలీజ్ అవుతుంది. 

ఇక రీసెంట్ గా ఈ మూవీకి సంబందించిన టీజర్ ట్రైలర్‌ ని రిలీజ్ చేశారు. ఇందులో పండోరా గ్రహానికి సంబంధించి అద్భుతమైన లొకేషన్స్, అబ్బురపరిచే నీలి సముద్రం, అదిరిపోయే విజువల్ గ్రాఫిక్స్ తో చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే ఈ సినిమా మెయిన్ స్టోరీని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top