లైగర్ ఫస్ట్ లిరిక్స్ కి అదిరిపోయే రెస్పాన్స్…

సెన్సేషనల్ హీరో విజయ దేవరకొండ, డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ లైగర్. ఈ సినిమాకి  సంబందించిన లిరికల్ టీజర్ ని ఈరోజు రిలీజ్ చేసింది ఫిలిం యూనిట్. హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ ని వదిలారు. 

ఇక ఈ టీజర్ కి అటు ఫ్యాన్స్ నుండే కాక, ఇటు ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లైగర్ హంట్ థీమ్ అంటూ వచ్చిన ఈ వీడియో మామూలుగా లేదు.  విజయ్ దేవరకొండ మేకోవర్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కిక్‌ బాక్సింగ్‌ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ మూవీని సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ తో పాటు, హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. 

ఇక స్టోరీ విషయానికి వస్తే… ముంబైలో ఉండే ఓ స్లమ్ డాగ్ కిక్ బాక్సర్ గా  ఎలా మారాడనేదే దీని సారాంశం. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక లైగర్ ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top