బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి  హడావుడి అప్పుడే మొదలైంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. అందుకు సంబందించిన ఓ లిస్ట్ కూడా బయటికి వచ్చేసింది.

ఇదిలా ఉంటే… మరోపక్క వరుస ప్రోమోలతో ఈ షో పై ఆసక్తి రేపుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇక వెయిటింగ్ అయిపోయింది, గ్రాండ్ ఓపెనింగ్ అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తారు. 

నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 నుంచీ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనే దీనికి హోస్ట్ గా ఉంటున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున ఎంట్రీ సీన్ అదిరింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top