తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో)

ఈమధ్య కాలంలో పబ్లిక్ రోడ్లనే స్పోర్ట్స్ స్టేడియంలా మార్చేసుకుంటున్నారంతా. ఎందుకిలా చెప్తున్నానంటే, పట్టపగలు… అందరూ చూస్తుండగా… బాగా రద్దీగా ఉండే రోడ్లపై ఫీట్స్ చేసేస్తున్నారు వాహనదారులు. అంతటితో ఆగకుండా బైక్ రేసులు, కార్ రేసుల్లో లాగా వెహికల్స్ ని ఓవర్ టేక్ చేయటం గొప్పగా ఫీలయిపోతున్నారు. సరిగ్గా ఒక SUV డ్రైవర్ చేసిన నిర్వాకం కూడా అలానే ఉంది.

ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రోడ్డుపై కొంతమంది బైక్ రైడర్లు వెళుతున్నారు. ఇంతలో ఓ స్కార్పియో డ్రైవర్… వారి పక్కనుండీ వచ్చి… వారిని తిట్టటం మొదలుపెట్టాడు. తిట్టటమే కాదు, బెదిరించాడు కూడా. అయితే, అతను గొడవ పడటంతో మిగతా బైకర్లు స్లో అయ్యారు కానీ, శ్రేయాన్ష్ అనే వ్యక్తి మాత్రం తాను తగ్గేదేలే..! అన్నాడు. అంతే వేగంతో ముందుకు సాగాడు.

కొద్ది దూరం పోనిచ్చి ఆ కారు డ్రైవర్… తనతో గొడవ పెట్టుకున్న బైకర్‌ని వెనక నుంచి తన కారుతో ఢీకొట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా వెనుకున్న ఓ బైకర్ వీడియో తీశాడు.

ఎప్పుడైతే ఆ కార్ డ్రైవర్ ఢీకొట్టాడో… అప్పుడు వెంటనే ఆ బైకర్ కింద పడిపోయాడు. మిగతా బైకర్లు వచ్చి అతన్ని పైకి లేపారు. ఆ బాధితుడి పేరు శ్రేయాన్ష్. వయసు 20 ఏళ్లు. అతను గురుగ్రామ్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఇంతకీ ఆ కార్ డ్రైవర్ అతనినే టార్గెట్ చేయటానికి గల కారణం ఏమిటో తెలుసా! అతను తన కార్ ని ఓవర్ టేక్ చేసి వెళ్ళడమే! అలా వెళ్ళటం అతనికి నచ్చలేదు. అందుకే ఆ బైకర్ ని ముందు బెదిరించాడు. వినకపోయేసరికి చంపబోయాడు. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు. ఈ వీడియో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కీ,  ప్రధానమంత్రి కార్యాలయానికీ కూడా ట్యాగ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top