ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో)

ప్రకృతి ప్రసాదించిన అందాలలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రమంతా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఘాట్ రోడ్లు, నదులు, సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లు, మలుపులు కూడా ఎక్కువే!

అయితే, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో థమరస్సెరీ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతమంతా ఎక్కువశాతం కొండలతో నిండి ఉంటుంది. ఆ కొండల మధ్యనుండి భయంకర మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, చూడతానికి ఈ ప్రాంతమంతా ఒక అడవిని తలపిస్తుంది. 

కానీ, ఈ ప్రాంతం గుండానే రోజూ వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 26న 20 ఏళ్ల వయసున్న ఓ ఇద్దరు కుర్రాళ్ళు బైక్‌పై వెళ్తున్నారు. వారి వెనుక నుండే మరో ఇద్దరు వ్యక్తులు కూడా  బైక్‌పై వెళుతున్నారు. అయితే, వారిలో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తున్నాడు.  

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

దాదాపు ఒక కిలోమీటర్ దాకా ప్రయాణించిన తర్వాత వారి ముందు వెళ్ళే బైక్ వీరికి 100 అడుగుల దూరంలో వెళ్తోంది. ఇంతలో ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి… ఆ బైకర్స్ ని ఢీకొట్టింది. అంతే…! అమాంతం వాళ్ళు బైక్ తో సహా ఎగిరి  లోయలో పడ్డారు. ఆ రాయి కూడా దొర్లుతూ వెళ్లి లోయలో పడింది. చూస్తుండగానే ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ మొత్తం వీడియోని వెనుక వెళ్తున్న బైకర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశాడు. 

అయితే, బ్యాడ్ లక్ ఏంటంటే, బైక్ డ్రైవ్ చేస్తున్న అభినవ్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ వెనక కూర్చున్న అనీష్ మాత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top