Car Accident due to Drunk and Drive

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో)

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఊరంతా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ… ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. కానీ, కొంతమంది యువకులు మాత్రం ఫుల్ గా తాగేసి రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు,  మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ అపార్ట్ మెంట్ ని గుద్దేశారు. ఇదంతా జరిగిందే వేరేక్కడో కాదు, హైటెక్ సిటీలోనే!

డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆంధ్రకేసరి నగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ… ఫుల్ గా తాగేసి… డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ ఓ అపార్ట్‌మెంట్‌ గోడని బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ కారు  రోడ్డుపై కొన్ని పల్టీలు కొట్టింది.

లక్కీగా ఆ కారులో ఉన్న వారికి ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే, ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే అపార్ట్‌మెంట్ లో నివసించే మహిళలు, చిన్నారులు ఆ గోడ దగ్గరే నిలబడి ఉన్నారట. అప్పుడే వారు లోపలికి వెళ్లడం… ఇంతలో కారు ఆ గోడని గుద్దుకోవడం రెండూ ఒకేసారి జరిగాయి. ఈ యాక్సిడెంట్ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top