Liger First Glimpse

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్-కమింగ్ మూవీ లైగర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే!  

ఇక పూరీ తన మార్క్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు, అడుగడుగునా ఎన్నో సర్‌ప్రైజ్ లతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్.  

ఈరోజు లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది ఫిలిం యూనిట్. ముంబైలో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి… ప్రొఫెషనల్ బాక్సర్ గా ఎలా మారాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఇక ఇందులోని మరో కీలక పాత్ర అయిన మైక్ టైసన్ పాత్ర సినిమా కథని మలుపు తిప్పుతుందట. 

ఇక ఈ గ్లింప్స్ లో విజయ్ ఇండియన్ ఫ్లాగ్ ని కప్పుకొని US తో పోటీ పండేందుకు బరిలోకి దిగుతాడు. ఈ సమయంలో విజయ్ బాడీ ఫిజిక్ ని హైలెట్ చేశారు మూవీ మేకర్స్.  యాక్షన్ అండ్ థ్రిల్ తో కూడిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని విజయ్ ఫ్యాన్స్  ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ చిత్రాన్ని రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.  ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ధియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top