పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..!

వరుస సినిమాలతో బిజీగా మారారు మెగాస్టార్. అందులో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కోలీవుడ్ హిట్ కొట్టిన వేదాళం సినిరంకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. 

ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా… చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది.

ఇందులో చిరు పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా కనిపించనున్నారట. ఈ కారణంగా ఖుషీ చిత్రంలోని నడుము సీన్ ని కూడా రీపీట్ చేయనున్నారట. ఇంతకీ ఈ సీన్ లో నటిస్తుంది ఎవరో తెలుసా! పవన్ గా చిరు, భూమిక గా శ్రీముఖి. అంతేకాదు, ఈ రీక్రియేషన్ సీన్ తెగ నవ్వులు పూయిస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా రిలీజయ్యాక పవన్ ఫ్యాన్స్ ఈ సీన్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో..!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top