‘ఎఫ్3’ లో పవర్ స్టార్?

దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు.  

ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 27 న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఇప్పటిదాకా ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపయ్యాయి.

అంతలా ఈ సినిమాకి సంబందించిన బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే, ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందట. అది ఎలా? ఏంటి? అనేది మాత్రం రివీల్ చేయలేదు. కాకపోతే, ఈ విషయాన్ని దిల్ రాజే స్వయంగా చెప్పడంతో నమ్మక తప్పట్లేదు. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top