Dasara Elephants get Jumbo Welcome at Mysore Palace to Participate in Dasara Festivities

మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో)

దసరా అంటే… దేశమంతా ఒక లెక్క… మైసూర్ ప్యాలెస్‌ ఒక్కటే మరో లెక్క. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది “జంబో సవారీ”. ఇందులో స్వయంగా ఏనుగులే పాల్గొంటాయి. మంగళ వ్యాయిద్యాల నడుమ అందంగా ముస్తాబైన గజరాజులు బారులుతీరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇది మైసూర్ ప్యాలెస్ లో తరతరాలుగా వస్తున్న ఆచారం. 

ప్రతీయేటా లాగే ఈ ఏడు కూడా ఈ ఉత్సవాల కోసం బయలుదేరిన ఏనుగులు సెప్టెంబర్ 13న మైసూర్ ప్యాలెస్ కి చేరుకున్నాయి. పోలీస్ బ్యాండ్ మేళాలతో, మంగళ వ్యాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అయితే, ఏటా ఈ ఉత్సవాల్లో దాదాపు 15 ఏనుగులు పాల్గొంటాయి. అయితే గతేడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాల్ని సాదాసీదాగా జరిపారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి అట్టహాసాలు లేకుండా కొద్దిపాటి ఏర్పాట్లతోనే జరపబోతున్నారు. అందువల్ల ఈ సంవత్సరం జంబో సవారీలో కేవలం 8 ఏనుగులు మాత్రమే పాల్గొనబోతున్నాయి.

ఈ 8 ఏనుగుల్లో 5 మగ, 3 ఆడ ఏనుగులు ఉన్నాయి. వీటన్నిటినీ గజరాజు అభిమన్యు ముందుండి నడిపించింది. మిగతా 7 ఏనుగులైన లక్ష్మీ, కావేరీ, చైత్ర, విక్రమ, అశ్వత్థామ, ధనంజయ, గోపాలస్వామి జయమార్తాండ గేట్ ద్వారా ప్యాలెస్‌ ఆవరణలోకి అడుగుపెట్టాయి. అయితే, అశ్వత్థామ మాత్రం తొలిసారిగా ఈ వేడుకల్లో పాల్గొనబోతుంది. అందుకే, ప్యాలెస్ దగ్గరికి రాగానే అక్కడి హంగామా చూసి… కాస్త టెన్షన్ పడింది.

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top