సినిమాని తలదన్నే విధంగా ఛేజింగ్ సీన్‌

తమిళనాడులోని కాంచీపురంలో ఇటీవలికాలంలో కారు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ… కారు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఒకవైపు కార్ల యజమానులకు, ఇంకోవైపు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని సీరియస్ గా డిసైడ్ అయ్యారు పోలీసులు. 

ముందుగా అసలు ఈ చోరీలకి పాల్పడుతుంది ఎవరనేది ఎంక్వైరీ చేశారు. వెంకటేష్‌ గ్యాంగ్‌ అని తెలుసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. చోరీ జరిగిన కార్ల వివరాలను జిల్లాల వారీగా అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించారు. వెంకటేష్‌ గ్యాంగ్‌పై నిఘా పెట్టారు. ఇక వారిని పట్టుకోవటమే ఆలశ్యం.

ఈ  క్రమంలో తంజావూర్ జిల్లా పట్టుకొట్టైలో దొంగిలించబడిన ఓ కారుని గుర్తించారు పోలిసులు. దీంతో వెంకటేష్‌ గ్యాంగ్‌ పై పెట్టిన నిఘాని మరింత వేగవంతం చేశారు, ఇంతలో ఆ గ్యాంగ్ సభ్యులు ఇద్దరు కనిపించారు. వెంటనే సినిమా స్టయిల్లో పరుగెడుతూ పోలీసులు ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు.

అయితే ఆ దొంగలని పోలీసులు పట్టుకునే సీన్‌ సినిమా సీన్‌ని  తలపించింది. ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్రగాయాలు కూడా అయ్యాయి. ఈ చేజింగ్‌ వీడియో ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ అయింది. అంతటితో ఆగకుండా వీరి గ్యాంగ్‌ లీడర్‌ వెంకటేష్ తో సహా మరో నలుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top