పుట్టిన సమయం, నక్షత్రమే కాదు, తేదీ కూడా మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి ఒక్క మార్పు కూడా వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలావరకూ జాతకాలని ఆస్ట్రాలజీ ఆధారంగానే చూస్తారు. కానీ, న్యూమరాలజీ ఆధారంగా కూడా మనిషి గుణగాణాలని లెక్కించవచ్చు.
మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ఈ 2022 సంవత్సరంలో మీరు మీ లైఫ్ లో ఊహించని అదృష్టాన్ని అందుకోవాలంటే ఈ ఆర్టికల్ చివరిదాకా చదవండి.
2022లో, ఓ మ్యాజిక్ ఫిగర్ మీ కెరీర్ కి ఊహించని లక్ ని తెచ్చిపెడుతుందని అంటున్నారు ప్రముఖ న్యూమరాలజిస్టులు. ఆ నెంబర్ వేరే ఏదో కాదు, 6. మీ బర్త్ డేట్ నెంబర్ 6 అయితే, 2022 మీకు మోస్ట్ లక్కీయెస్ట్చ ఇయర్. మీరు పుట్టిన నెల ఏదైనా పరవాలేదు. ఆ నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించి ఉంటే చాలు, వారి రాడిక్స్ 6 అవుతుంది. అటువంటి వారందరికి వచ్చే ఏడాది చాలా బాగుంటుంది.
ఈ సంవత్సరం మీ కెరీర్‌లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీ ప్రతిభని కనబరచడానికి ఇదో గొప్ప అవకాశం. పని చేస్తున్న ఉద్యోగంలో మీరు లాభాలను పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు. అయితే, ఈ సంవత్సరం పెట్టుబడికి కూడా చాలా అనుకూలం. కొత్త విషయాలను నేర్చుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు.
6వ సంఖ్యా జాతకులకి ఈ సంవత్సరం వారి జాతకంలో శుక్ర స్థానం బలంగా ఉండటం వల్ల… వాహన, గృహ యోగం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారికీ ఏడాది సంతోషాలు, సౌకర్యాలు పెరుగుతాయి.
ప్రేమ విషయంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. మీ పార్ట్ నర్ తో ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉంటుంది. కానీ ఎలాంటి వివాదాలైనా వెంటనే పరిష్కరించబడతాయి. అందుకే వివాహితులు వాదనలకు కొంచెం దూరంగా ఉంటే బెటర్. అయితే, మీ లైఫ్ పార్ట్ నర్ నుంచి కెరీర్‌లో ఫుల్ సపోర్ట్ లభిస్తుంది.
ఇక విద్యార్ధులకి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చిన ఆపర్చ్యునీటీస్ ని సద్వినియోగం చేసుకున్నట్లయితే, రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఆస్థి కూడా పెరగవచ్చు. ఫైనల్ గ ఈ కొత్త సంవత్సరం మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు.