Jr NTR Paying Tribute to Late Puneeth Rajkumar at RRR Launch Event

పునీత్ కోసం పాటపాడిన ఎన్టీఆర్! ఇదే తొలిసారి.. ఆఖరిసారి… అంటూ ఎమోషనల్!! (వీడియో)

శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఉంది.  2016లో పునీత్‌ నటించిన ‘చక్రవ్యూహ’ మూవీ కోసం ఏకంగా ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. ‘గెలయా గెలయా… అంటూ సాగే ఈ పాట అప్పుకి  సూపర్‌ డూపర్ హిట్ ని అందించింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈ పాటని పాడుతూ… తమ రిలేషన్ ని మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు ఎన్టీఆర్‌.

శుక్రవారం బెంగళూరులో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఆ   కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్‌, రాజమౌళి, అలియా భట్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, తన స్నేహితుడైన పునీత్‌ రాజ్‌కుమార్‌ని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.  

అప్పట్లో పునీత్ కోసం తొలిసారిగా కన్నడలో పాడిన గెలయా… గెలయా… సాంగ్ ని ఇప్పుడు తన ప్రచార వేదికపై ఆలపిస్తూ… భావోద్వేగానికి గురైయ్యారు. ‘‘ నేనీపాటని ఎప్పుడూ ఎక్కడా పాడలేదు. ఆయన గౌరవార్థం ఇప్పుడు పాడుతున్నా! ఇదే తొలిసారి, ఆఖరి సారి కూడా! ఆయన ఎక్కడ ఉన్నా… మనల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నా’’ అని కన్నీటిపర్యంతమయ్యాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top