India-China 13th Military Commander Level Talks

భారత్ – చైనాల మధ్య 13వ దఫా చర్చలు (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి..మొన్నీమద్యనే బోర్డర్ లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడగా… ఇండియన్ ఆర్మీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వారిని తిప్పికొట్టింది.  

ఇటీవలి కాలంలో చైనా బలగాలు తమ సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్ కి ప్రవేశించటం, అలానే, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిటం జరిగింది. ఈ  నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తూర్పు లఢఖ్ ప్రాంతాల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ చర్చల ప్రధాన లక్ష్యమని సెంట్రల్ గవర్నమెంట్ సోర్సెస్ వెల్లడించాయి.  ఇండియన్ ఆర్మీకి లెహ్‌లోని 14 కారప్స్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అయిన పీజీకే మీనన్‌ ఈ చర్చలకి నాయకత్వం వహించనున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top