ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన జీవుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు ఇవి అచ్చం మనుషుల్లానే బిహేవ్ చేస్తుంటాయి. దీనికి కారణం మనుషులు చింపాంజీలనుండీ రావడమే!
హ్యూమన్ జెనెటిక్ పై రీసర్చ్ చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషులు, మరియు చింపాంజీలు తమ DNA లో 98.8 శాతం షేర్ చేసుకుంటారు. అందుకే అవి చేసే పనులు ఒక్కోసారి మనుషులు చేసే పనులు మాదిరిగానే ఉంటుంటాయి.
మనం చేసే పనిని ఏదైనా ఒకసారి చూస్తే… అవి యిట్టె అనుకరిస్తుంటాయి. ఇక మనుషులతో చాలా ప్రేమగా మెలుగుతాయి కూడా. ఒక్కోసారి ఇవి చేసే పనులు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దీంతో అందరి దృష్టిని తమవైపుకి తిప్పుకుంటాయి.
ఇక రీసెంట్ గా జరిగిన ఇష్యూ ఇది. ఓ చింపాంజీ బట్టలు ఉతుకుతూ కనిపించింది. దానిని చూసిన కొందరు ఔత్సాహికులు వీడియో తీసి తమ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం చింపాంజీ బట్టలు ఉతికే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎక్కడ దొరికిందో తెలియదు కానీ, ఒక ఎల్లో కలర్ టీ షర్ట్ ని పట్టుకొచ్చి… దానిని బండపై వేసి… ఆచం మనిషిలాగే వాష్ చేసింది. తర్వాత దానికి సోప్ కూడా పెట్టింది. అనంతరం బ్రష్ తో క్లీన్ చేసింది. ఆ తర్వాత వాటర్ లో జాడించింది. ఏదేమైనా కానీ, చింపాంజీ బట్టలు ఉతకడం చూసి ఆశ్చర్యపోవటం మన వంతైంది.
View this post on Instagram