These 5 Zodiac Signs are most Revengeful

ఈ 5 రాశుల వారిని ఎవరైనా చిన్న మాట అంటే చాలు… వారికి నరకం చూపిస్తారు!

మనుషులంతా ఒకే విధంగా ఉండరు. కొందరు ఓపెన్ మైండెడ్‌గా ఉంటే… ఇంకొందరు క్లోజ్‌డ్ మైండెడ్‌గా ఉంటారు. కొంతమంది ట్రెడిషన్స్ కి, వ్యాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తే… మరికొంతమంది వారి స్కిల్స్ కి, ఎక్స్ పీరియన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదేమైనా న్యారో మైండెడ్ గా ఉంటూ… ఏ మాత్రం మార్పుని అంగీకరించరు. కానీ, వీరిని ఎవరైనా చిన్నమాట అంటే చాలు… వారిమీద రివేంజ్ తీర్చుకోనేంత వరకూ వదిలిపెట్టరు.  అలాంటి రాశులేవో ఇప్పుడు చూద్దాం.    

మేష రాశి:

మేష రాశి వారు ఏ పనైనా… మనస్ఫూర్తిగా చేస్తారు. ఏదైనా ఒక విషయంలో జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తే… హృదయపూర్వకంగా వ్యవహరిస్తారు. తాము చేయాలనుకున్న పనిలో ఇతరులు జోక్యం చేసుకొంటే వారికి అస్సలు నచ్చదు. వారు చేసేదే కరెక్ట్ అని, వారు ఎంచుకున్న మార్గాలే ఉత్తమమైనవని భావిస్తారు. తమనెవరైనా హర్ట్ చేస్తే… రివేంజ్ తీర్చుకోనేదాకా వదిలిపెట్టరు.

Also Read: ఈ 4 రాశులవారు సక్సెస్ కి మారుపేరుగా నిలుస్తారు… అందులో మీరున్నారా..!

మిథున రాశి:

మిథున రాశి వారు ఎంతో మనస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఎదుటివారికి హ్యాపీ నెస్ ని అందించడానికి తమ మార్గం నుంచి బయటకి వస్తారు. కానీ, అవతలివారు తమ గురించి తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం క్లోజ్డ్ మైండ్‌ కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మనస్ఫూర్తిగా వ్యవహరించడంలో వెనుకంజ వేస్తారు. అసలు విషయాన్ని దాటవేస్తారు. 

Also Read: ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే.. అదృష్ట దేవతని వరించినట్లే!

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన, భావోద్వేగమైన వ్యక్తిత్వం కలిగి  ఉంటారు. వీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ సభ్యులు ఏం చేసినా భరిస్తారు. కానీ, ఎవరైనా చిన్న మాట అన్నా ఊరుకోరు. వెంటనే, వారితో డీలింగ్స్ కట్ చేసేసుకుంటారు. అన్నిరకాలుగాను వారిని ఎవాయిడ్ చేస్తారు. ఫైనల్ గా వారి జీవితాన్ని నరకప్రాయంగా మార్చేవరకు వీరు నిద్రపోరు. వీరు నిజమైన సాంప్రదాయవాదులు. కొత్త విషయాలను అంగీకరించాలన్నా, వాటికి అలవాటు పడాలన్నా టైమ్ ఎక్కువ తీసుకుంటారు.

Also Read: ఈ 3 రాశులవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ… అందులో మీరున్నారా..?

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు ఎంత చూడటానికి సెన్సిటివ్ గా ఉంటారో… తేడా వస్తే తాట తీస్తారు. సాధ్యమైనంత వరకూ వీళ్ళు ఎవ్వరి జోలికి వెళ్లరు. వారి జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. వెంటాడి, వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటారు. వీరిని ఎవరైనా హర్ట్ చేస్తే… వారి ఎండింగ్ చూసేంతవరకూ విశ్రమించరు. వీళ్ళు స్కెచ్ గీసిన విషయం వీరిని బాధపెట్టినవారికి తప్ప మరెవ్వరికీ తెలియదు, కేవలం వారికి మాత్రమే అర్ధమవుతుంది. అంతలా నరకం చూపిస్తారు.

Also Read: ఈ 4 రాశులవారికి డబ్బుకు లోటు ఉండదు!

కన్యా రాశి:

కన్యా రాశి వారు వాస్తవాలనే ఎక్కువగా మాట్లాడతారు. అలాగే, ముక్కుసూటిగా కూడా మాట్లాడతారు. మైండ్ గేమ్ ఆడటం, మభ్యపెట్టడం వంటివి వీరికి తెలియదు. ఏదైనా స్ట్రయిట్  ఫార్వార్డే!  ఇక తమనెవరైనా  బాధ పెడితే… ఆ బాధ ఎలా ఉంటుందో వారికి కూడా రుచి చూపిస్తారు.  పుట్టుకతోనే వీళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ అనే ముద్ర కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. వీరు తమలో ఉన్న స్కిల్స్ కి,  ఎక్స్ పీరియన్స్ కి కట్టుబడి ఉంటారు. వీలైనంతవరకూ ఉన్న పద్ధతులనే పాటించాలని అనుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మార్పుని అంగీకరిస్తారు.

Also Read: ఈ రాశుల వారు తమ మనసులో భావాలని ఎట్టి పరిస్థితిలోనూ బయట పెట్టరు!

మీన రాశి:

మీన రాశి వారు తాము చెప్పిందే వేదం, చేసేదే శాసనం అన్న రీతిలో ఉంటారు. అంతేకానీ, ఇతర విధానాలు, పద్ధతులను అస్సలు పాటించరు. వీరు తమ చుట్టూ ఒక గిరి గీసుకుని అందులోనే బతికేస్తారు. అనుకున్నదానికే కట్టుబడి ఉంటారు. ఎంచుకున్న మార్గాన్నే అనుసరిస్తారు. న్యారో – మైండెడ్ గా వ్యవహరిస్తుంటారు. వీరింతలా స్ట్రిక్ట్ గా  ఉండటానికి కారణం… వీరిపై వీరికున్న విశ్వాసమే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top