India’s Pralay Missile Successfully Reaches its Target

లక్ష్యాన్ని చేదించిన ప్రళయ్‌… ఇక చైనా గుండెలు గుబేల్…! (వీడియో)

భారత అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే… ప్రళయ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. ఈ మిస్సైల్‌ ని ఒడిశా లోని బాలాసోర్‌ కేంద్రం నుంచి DRDO సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది.

బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రోగ్రాంలో భాగంగా… పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా…మిస్సైల్‌ డిజైన్ చేయబడింది. దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించటం జరిగింది. ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉండే టార్గెట్స్ ని సక్సెస్ ఫుల్ గా రీచ్ అవ్వగలదు. సాలిడ్‌ ప్రొపెల్లంట్‌ రాకెట్‌ మోటార్‌, అవుట్ స్టాండింగ్ మిస్సైల్ గైడెన్స్‌ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్‌ ఏవియానిక్స్‌ వంటి కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ ఉపయోగించి… ప్రళయ్‌ ని రూపొందించారు.

పేరుకి తగ్గట్టుగానే ప్రళయ్‌… శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. భారత్‌పైకి దూసుకొచ్చే ఇంటర్‌సెప్టార్‌ మిసైల్స్‌ ఏవైనా సరే ఇది నేలకూలేలా చేస్తుంది. కొంతదూరం ప్రయాణించిన తర్వాత గగనతలంలో తన దారిని మార్చుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది. 

ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ నుంచి… బుధవారం ఉదయం 10.30 గంటలకి ప్రళయ్ ని ప్రయోగించారు. దీనిని ప్రయోగించటంలో DRDO సక్సెస్ అయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top