ఒక్కోసారి కొంతమందిని చూడగానే మనకి తెలియకుండానే మనం వాళ్లకి అడిక్ట్ అయి పోతాం. అంతలా వాళ్ళు తమ మాటలతో మనల్ని కట్టిపడేస్తారు. ఎప్పుడూ వారితోనే ఉండాలనిపిస్తుంది; వారితోనే మాట్లాడాలనిపిస్తుంది. ఆ రీతిలో వారి మాటలు ఉంటాయి.
మాట్లాడటం అందరూ చేస్తారు, కానీ వారి మాటకారి తనంతో ఎదుటివారిని ఆకర్షించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేవలం 5 రాశులకి చెందినవారై ఉంటారు. ఆ 5 రాశులు ఏమిటో… అందులో మీ రాశి ఉందేమో ఒకసారి ట్రై చేయండి.
మేష రాశి:
ఈ రాశివారి మాటకారితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు తమ వ్యక్తిత్వం, సెన్స్ ఆఫ్ హ్యుమర్ ద్వారా ఎలాంటివారినైనా ఇట్టే ఆకర్షిస్తారు. ఇతరులను చాలా ఈజీగా ఎట్రాక్ట్ చేసుకుంటారు.
మిధున రాశి:
ఈ రాశివారు అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతారు. తమ సొంత విషయాలని కూడా ప్రతీ ఒక్కరితో పంచుకుంటారు. వీరికి ఎవరైనా కాస్త ఎట్రాక్షన్ గా కనిపిస్తే చాలు… తమకు తెలియకుండానే తమ మాటకారితనంతో వారిని కట్టిపడేస్తారు. ఏదేమైనా మాటలు చెప్పటంలో వీరిది అందె వేసిన చేయి.
సింహ రాశి:
ఈ రాశివారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా కలిగి ఉంటారు. అందరిపట్లా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. సమయాన్ని వృధా చేయరు. ఇతరులు వీరిపట్ల ఆకర్షించపడటానికి కారణం ఇదే!
వృశ్చిక రాశి:
ఈ రాశివారికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. వీరిలో తెలియని రహస్యాలు ఎన్నో దాగుంటాయి. వీరి మనసులో దాగి ఉండే మర్మాల గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారంతా వీరి పట్ల ఇట్టే ఆకర్షితులవుతారు. అంతేకాదు, ఎలాంటివారినైనా సరే తమ మాటలతో చాలా ఈజీగా కట్టిపడేస్తారు. వీరిని మాటల్లో గెలవటం ఎవరి వల్లా కాదు.
ధనుస్సు రాశి:
ఈ రాశివారు ఇతరుల పట్ల అంత ఈజీగా ఆకర్షితులవ్వరు కానీ, ఎవరైనా నచ్చి ప్రయత్నిస్తే మాత్రం… వారిని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీరి టాకింగ్ కి ఎదుటివారు ఎట్రాక్ట్ అవుతారు.