ITBP Jawans Training in -25°C Snow

దేశాన్ని కాపాడటం కోసం ఎముకలు కొరికే చలిలో జవాన్ల శిక్షణ (వీడియో)

సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే! దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ… ఇన్నీ… కావు. ఎండ‌కు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ, చ‌లికి వ‌ణుకుతూ, ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి మరీ దేశం కోసం సేవలందిస్తారు.  తమ దేశాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. అందుకే ఆర్మీ జ‌వాన్ల‌ని మ‌నం అంతలా గౌరవిస్తాం. 

అయితే,  ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ITBP) -25°C చలిలో శిక్షణ పొందుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు వారికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియోని ఓ మీడియా కంపెనీ ట్విట్టర్‌ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఉత్తరాఖండ్‌ బార్డర్ లో… అత్యంత తీవ్రమైన చలిలో… జవాన్లు శిక్షణ పొందటం మనం చూడచ్చు. 

చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు… వాటి మద్య భారీ కవాతులు చేస్తున్న జవాన్లు… వారిని గైడ్ చేస్తున్న ట్రైనర్. అంతటి కఠినమైన పరిస్థితులని కూడా అధిగమించి దేశాన్ని కాపాడుతున్నందుకు నిజంగా వారందరికీ సెల్యూట్ చేయాల్సిందే! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top