Thursday, October 6, 2022
spot_img

క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి… లక్కీగా సేవ్ అయిన బైకర్! (వీడియో)

ట్రైన్ యాక్సిడెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో… ఈ వీడియో చూస్తే తప్పక అర్ధమవుతుంది. వాహనాలే తునాతునకలైపోతుంటే… ఇక మనుషుల సంగతేంటి?

ఒక బైకర్ రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే, ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. వ్యక్తయితే సేవ్ అయ్యాడు కానీ, అతని బైక్ మాత్రం నుజ్జు నుజ్జు అయింది.

నిత్యం రాద్దీగా ఉండే ముంబై నగరంలో… ఓ ప్రాంతంలో రోడ్ కమ్ రైల్ ట్రాక్ ఉంది. ఆ సమయంలో అటువైపుగా రాజధానిగా ఎక్స్‌ప్రెస్‌ రాబోతుంది. ట్రైన్ రాబోతుందని తెలిసి అధికారులు గేట్ వేశారు. 

అయితే, కొందరు మాత్రం హడావిడిగా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఓ యువకుడు కూడా బైక్‌పై రయ్‌మని దూసుకువచ్చాడు. అంతలోనే ట్రాక్ పై వేగంగా రైలు దూసుకువస్తుంది. 

వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు బైక్‌ వదలేసి వెనక్కి రాబోయాడు. ఇంతలో దూసుకువచ్చిన ఆ ట్రైన్.. అతని బైక్‌ను ఢీకొట్టింది. ట్రైన్ దాటికి బైక్ ముక్కలు ముక్కలు అయ్యింది. కానీ, లక్కీగా అతను మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ షాకింగ్ ఇంసిడెంట్ రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనిని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్నంతసేపూ బైకర్ కే కాదు, చూసేవాళ్ళకి కూడా ఒళ్ళు గగుర్పొడవటం ఖాయం.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,513FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles