Jay Brewer with Dozens of Pythons Around him

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి? 

పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనది. ఇతను ఎన్నో భయంకరమైన పాములను అలవోకగా పట్టేస్తుంటాడు. ఆ సమయంలో తీసే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్  చేస్తుంటాడు. కానీ, చూసేవాళ్ళకి మాత్రం ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది. 

రీసెంట్ గా బ్రూవర్‌ లేటెస్ట్ వీడియో ఒకటి బయటకొచ్చింది. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో బ్రూవర్‌ అనకొండల మధ్య కూర్చొని ఆటలాడుతూ,  వాటితో సరదాగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాడు.  అప్పుడే సడెన్ గా పైనున్న అనకొండలు అతడిపై పడతాయి. మనమధ్య ఇలాంటివన్నీ కామనేలే అన్నట్లు అతను మామూలుగా వాటితో ఆడుకుంటూ ఉంటాడు. 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

Pawan Kalyan in OG Movie stylish look with gun on shoulder during mass action sequence
OG మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్! (వీడియో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top