Kerala Boy Miraculous Escape from Road Accident

అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చిన బాలుడు (వీడియో)

కొన్ని ప్రమాదాలు మన ఏమరపాటు వల్ల జరిగితే, ఇంకొన్ని ప్రమాదాలు మనం అస్సలు ఊహించకుండా జరిగిపోతాయి. అయితే, మరికొన్ని ప్రమాదాలు మాత్రం యమలోకం అంచులదాకా తీసుకువెళతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది.

మార్చి 24 సాయంత్రం కేరళ రాష్ట్రంలో ఓ మిరాకిల్ జరిగింది. కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలో ఉన్న చోరుక్కల అనే ప్రాంతం వద్ద ఓ సైకిల్ ప్రమాదం జరిగింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్పీడ్ గా సైకిల్ తొక్కుకుంటూ ఓ సందులో నుంచి వస్తున్నాడు. అదే స్పీడుతో మెయిన్ రోడ్ క్రాస్ చేసేందుకు ట్రై చేశాడు. 

కానీ, అనుకోకుండా తన సైకిల్ బ్యాలన్స్ తప్పి, అటువైపుగా వెళ్తున్న ఓ బైక్ ని ఢీకొట్టటం జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఆ బైక్ వెనుకే ఓ బస్సు కూడా వస్తోంది. అయితే, బైక్ ని గుద్దిన బాలుడు ఎగిరి రోడ్డుకి అవతల పక్కన పడిపోగా… తన సైకిల్ పైకి మాత్రం బస్సు ఎక్కేసింది. 

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

ఆ పిల్లవాడు లక్కీగా సేవయ్యాడు కానీ, లేదంటే ఆ బస్సు చక్రాల కింద తను పడాల్సింది. కాకపోతే, బ్యాడ్ లక్ ఏంటంటే, బస్సు కింద పడ్డ తన సైకిల్ మాత్రం నుజ్జు నుజ్జయింది. ఈ యాక్సిడెంట్ కి  సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో… ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. మొత్తం మీద అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చాడు ఆ బాలుడు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top