Lady Ghost Prank Video is going Viral

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో)

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే… ఇంకొన్ని ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోల్లో అయితే ఇలా ప్రాంక్‌ చేసిన వాళ్ళు తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లో ఒక ఫ్రాంక్ స్టార్… ఘోస్ట్ లా డ్రెస్ చేసుకొని సరిగ్గా లిఫ్ట్ ఎక్కబోయే ప్లేస్ కార్నర్ లో నిల్చొని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన చేతులు, కాళ్ళు అస్సలు కనపడనీయకుండా ఫుల్ గా కవర్ చేసుకొంది. వైట్ కలర్ లో లాంగ్ ఫ్రాక్ ధరించి… తన జుట్టు విరబోసుకొని… ఆ జుట్టు మొత్తం తన మొహం మీద పడేలా చేసి… లిఫ్ట్ పక్కనే గోడకి ఆనుకొని నిలబడి ఉంది. 

అయితే, ఆ లిఫ్ట్ ఉన్న ఏరియాలో కాస్త చీకటిగా ఉంది. యధాప్రకారం లిఫ్ట్ ఎక్కేందుకు వచ్చిన ఇద్దరు యువతులు ఆ దెయ్యాన్ని చూసి భయపడి పారిపోయారు. దీంతో, ప్రాంక్ చేసిన యువతి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. అయితే, కొద్దిసేపటి తరువాత ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను కూడా ఆ దెయ్యాన్ని చూసి భయం భయంగా ముందుకు వెళ్ళాడు. కానీ, ఇంతలోనే ఆమెకి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. 

అలా భయంతో ముందుకి వెళ్లిన వ్యక్తి… మళ్లీ వెనక్కి వచ్చాడు. లిఫ్ట్ ముందు ఘోస్ట్ మాదిరిగా నిల్చున్న యువతిని ఎగిరి కాలితో ఒక తన్ను తన్నాడు. ఆమె పడిపోయింది. అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ట్విస్ట్‌కి ప్రాంక్ గర్ల్ కాస్తా షాక్ కి గురయింది. కొద్దిసేపటికి ఆ షాక్ నుంచీ కోలుకొని, అతని దెబ్బకి ముక్కుతూ మూలుగుతూ లేచి, సైలెంట్‌గా అక్కడినుండీ వెళ్లిపోయింది. 

ఈ సీన్ మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అది కాస్తా వైరల్‌ అయింది. ఆ ఫన్నీ వీడియోని చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం… మీరూ ఓ లుక్కేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top