ఈ రాశి వాళ్ళు తమ పార్టనర్ తో ఎవరైనా క్లోజ్ గా ఉంటే అస్సలు తట్టుకోలేరట!

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మన పార్టనర్ అవతలి వాళ్ళతో కాస్త క్లోజ్ గా మూవ్ అయితే చాలు, వెంటనే జలసీ వచ్చేస్తుంది. ఇది ఆడవారిలో మాత్రమే కాదు, మగవారిలో కూడా కామన్ గా జరిగే విషయమే! అయితే, ఈ జలసీ అనేది మన లైఫ్ లో ఎన్నో సందర్భాల్లో వస్తుంటుంది. కానీ, మన పార్టనర్ విషయంలో వచ్చే జలసీ రూటే వేరు. ముఖ్యంగా వారిపట్ల మనకున్న లవ్ కారణంగా త్వరగా ఎమోషన్ ఫీలవుతాం. 

ఇక మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. అయితే, ఈ రాశుల ఆధారంగా వ్యక్తుల ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కొన్ని కొన్ని రాశుల వ్యక్తుల విషయంలో ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మరి అవి ఏ రాశులో… అందులో మీ రాశి ఉందో.. లేదో… చెక్ చేసుకోండి. 

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వాళ్ల విషయానికి వస్తే… ఈ రాశి వాళ్ళు చాలా ఈజీగా జలసీ ఫీలవుతారు. కానీ, అస్సలు బయటపడరు. వీళ్ళెప్పుడూ రిలేషన్ షిప్‌లో సెక్యూరిటీని చూసుకుంటారు. ఒకవేళ సరైన సెక్యూరిటీ లేకపోతే తెగ ఫీలై పోతుంటారు. ఈ రకంగా వీళ్ళు వెంటనే అసూయకి గురవుతారు. అంతేకాదు, కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా కూడా ఉంటారు ఒకసారి ప్రేమలో పడాలన్నా… ఎవరితోనైనా రిలేషన్‌షిప్ మొదలు పెట్టాలన్నా… దానిని కంటిన్యూ చేయాలన్నా… ఎంతో బాగా ఆలోచిస్తారు. 

సింహ రాశి:

సింహరాశి వాళ్ల విషయానికి వస్తే… వీళ్ళు తమ పార్టనర్‌ తో ఎంతో ప్యాషనేట్ గా ఉంటారు. పార్టనర్‌ తో ఎవరైనా కలిసి వున్నా… బాగా దగ్గరగా మూవ్ అయినా… వీళ్ళకి ఈజీగా జలసీ వచ్చేస్తుంది. అలాగే తమ భాగస్వామితో ఎవరితోనైనా మాట్లాడినా… పొగిడినా కూడా వీళ్ళు త్వరగా అసూయపడిపోతారు. 

కన్యా రాశి:

కన్యా రాశి వాళ్ళ విషయానికి వస్తే… వీళ్ళు చాలా క్రిటికల్‌గా ఉంటారు. అలాగే, తమ పార్టనర్ విషయంలో కూడా అంతే క్రిటికల్‌గా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు తమ పార్టనర్ చేసే తప్పుల్ని ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూ… ఈజీగా అప్సెట్ అయిపోవడం, జలసీ ఫీలవడం వంటివి  చేస్తారు. ఇంకా, కన్యా రాశి వాళ్ళు పరిస్థితుల గురించి ఎక్కువగా  ఆలోచిస్తూ… పార్టనర్ పై ఎక్కువ కోపం చూపిస్తారు. 

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వాళ్ళ విషయానికి వస్తే… వీరు ఎప్పుడు అసూయ పడతారు? ఎప్పుడు కోపానికి గురి అవుతారు? అసలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? అనేది చెప్పటం కష్టం. ఎందుకంటే, ఈ రాశి వాళ్ళు తమని తాము కంట్రోల్ చేసుకోలేరు. వారికి ఏది వచ్చినా ఆపలేం. అంత హై పిచ్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ప్రేమ, కోపం, అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ ఈక్వల్ గా ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి బయటికి వస్తాయి. వీరికి జలసి ఎక్కువే! ఒక్కోసారి వీళ్ళు చూపించే కోపం కారణంగా పార్టనర్ కి ఫ్రస్టేషన్ కూడా వస్తుంది. 

మీన రాశి:

మీన రాశి వాళ్ల విషయానికి వస్తే… వీళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అలాగే, అసూయ కూడా ఎక్కువే! ఈ రాశివాళ్ళు  కమ్యూనికేషన్ ని ఎక్కువగా కోరుకుంటారు. సరైన కమ్యూనికేషన్ లేక పోతే… తెగ ఫీలై పోతుంటారు. ఒకవేళ వీరి పార్టనర్ వీరితో సరిగా  లేకుండా… మరొకరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే… వీళ్ళ మూడ్ వెంటనే మారిపోతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top