Lights should be Lit in these 8 Places on Diwali for a Lifetime of Prosperity

అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉండాలంటే… దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..!

దీపావళి వచ్చిందంటే చాలు చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పాలు పంచుకుంటారు. అందుకే, హిందువుల పండగలన్నిటిలోనూ దీపావళి ప్రత్యేకతే వేరు. 

‘దీపం’ అంటే లక్ష్మీదేవి. దీపావళి అంటే లక్ష్మీదేవి భూమిపై సంచరించే రోజు. అందుకే, దీపావళి రోజు అందరూ ఆ తల్లి ఆశీర్వాదం పొందాలని చూస్తారు. అందుకే, ఆమె రాక కోసం ఎదురుచూస్తుంటారు. లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సిరి సంపదలకి లోటుండదు. ఈ కారణంగానే, దీపావళి రోజున వినాయకుడు, మరియు లక్ష్మిదేవిని పూజిస్తారు. 

దీపావళి రోజున లక్ష్మిదేవికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందమైన రంగవల్లికలు, రకరకాల పూలు, అరటి బోదెలతో అలంకరిస్తారు. రకరకాల పిండివంటలు చేసి… ఆ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక సాయం సంధ్యా సమయానికి ఇళ్లలో మట్టి ప్రమిదల్లో నూనేపోసి… దీపాలు వెలిగిస్తారు. దీంతో అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. 

నిజానికి దీపావళి రోజు దీపాలని అందరూ వెలిగిస్తారు. కానీ, లక్ష్మిదేవి ఇంటిలో శాశ్వతంగా ఉండిపోవాలంటే… కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

  1. దీపావళి రోజు సాయంత్రం వెలిగించే దీపాలలో… ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకంటే,  లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే మొట్టమొదటి ప్రదేశం ఇదే! అందుకే మెయిన్ గేట్ దగ్గర అందమైన పూలతో అలంకరించి… ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి. 
  2. స్టోర్ హౌస్‌లో కూడా ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఎందుకంటే, ధాన్యం, సరుకులు మొదలైనవి ఈ స్టోర్ హౌస్‌లో బద్రపరచి ఉంటాయి కాబట్టి.
  3. డబ్బుని నిల్వ ఉంచే ప్రదేశం అయిన బీరువాలు, లాకర్లు, కప్ బోర్డులు వంటి ప్రదేశాలలో కూడా దీపం పెట్టాలి.
  4. వెహికల్స్ కూడా ఆస్థిలో భాగమే కాబట్టి దాని చుట్టుప్రక్కల ఎక్కడైనా దగ్గరలో దీపం వెలిగించాలి. 
  5. ఇక మంచినీటి కుళాయిలు, బావులు, మోటార్లు ఉన్నచోట పూజ చేసి దీపం పెట్టాలి.
  6.  ఇంటికి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే… అక్కడ కూడా దీపం పెట్టాలి. 
  7. రావి చెట్టులో 33 రకాల దేవతలు ఉంటారాని అంటారు. అలాగే, విష్ణుమూర్తి స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని ప్రజల విశ్వాసం. అందుచేత ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది.
  1. తులసి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి… ఇంట్లో ఉన్న తులసి దగ్గర కూడా దీపం పెట్టాలి. 

సో  ఫ్రెండ్స్…  విన్నారు కదా!  దీపావళికి ఈ 8 ప్రదేశాలలో దీపం పెడితే, ఇక అదృష్టం మిమ్మల్ని వరించినట్లే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top