Lord Shiva Idol Discovered Under the Land

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో)

కలలో దేవుడు కనిపిస్తే మంచిదని అంటారు. కానీ, ఆ దేవుడు నేనిక్కడున్నాను అంటూ తన ఉనికిని తెలియచేస్తే ఏమనుకోవాలి? తననెవరూ గుర్తించలేదు అనుకోవాలా? గుర్తించినా పట్టించుకోలేదు అనుకోవాలా? లేక నిర్లక్ష్యం అనుకోవాలా? సరిగ్గా ఇదే జరిగింది ఒక ప్రాంతంలో.

ఓ మహిళకి తన కలలో దేవుడు కనిపించాడు. అలా కనిపించిన దేవుడు వాస్తవరూపం దాల్చాడు. ఈ సంఘటన చూసి గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్క ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఆ వింతని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.  

వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో నివసిస్తున్న కొక్కిలిగడ్డ లక్ష్మి(మంగమ్మ) అనే మహిళకి కలలో పరమ శివుడు కనిపించి…తాను ఓ ప్రదేశంలో ఉన్నట్లు ఆనవాళ్ళు తెలియచేస్తాడు. నిజానికి ఆ ప్రాంతాన్ని 30 సంవత్సరాల క్రితమే శివాలయం నిర్మాణం కోసం కేటాయించారు.  కానీ, ఇప్పటివరకూ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. దీంతో, ఖాళీగా పడున్న ఆ భూమిలో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలని అధికారులు తీర్మానం చేశారు.  చేయడమే కాదు, త్వరితగతిన సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు కూడా. అందులో భాగంగానే, ఆ ఖాళీ స్థలాన్ని కొలతలు వేసి, ప్లానింగ్ గీశారు. ఇక నిర్మాణ పనులు మొదలుపెట్టాలని అక్కడికి వెళ్ళిన అధికారులకి చుక్కెదురైంది.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

అర్జంట్ గా ఆ కన్స్ట్రక్షన్ ఆపేయాలంటూ కోరింది ఒక మహిళ. ఆమె ఎవరోకాదు, ఇందాక మనం చెప్పుకున్న కొక్కిలిగడ్డ లక్ష్మి. ఈమె తనకి జరిగిన విషయం గురించి అక్కడి వారందరికీ చెప్పింది. తనకి కలలో కనిపించిన శివుడు కొలువై ఉన్న ప్రదేశం వేరేక్కడో కాదు, ఇక్కడే! ఇక్కడి భూమిలో శివలింగం ఉందని… ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే, విషయం మీకే అర్ధమవుతుందని చెప్పింది. 

ఇక చేసేదేమీలేక అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టారు. రెండు అడుగుల లోతు తవ్వగా నిజంగానే శివలింగం బయటపడింది. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. దీంతో,  ఆ  శివలింగాన్ని దర్శించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలిస్తున్నారు. శివలింగానికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top