రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాల నడుమ ఎంతో రసవత్తరంగా సాగిన ‘మా’ అధక్ష ఎన్నికలకి తెరపడింది. మంచు విష్ణు ప్యానెల్ గెలిచింది. ఇక అద్యక్ష పదవికి విష్ణు ప్రమాణ స్వీకారానికి ఈరోజు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడానికి బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లోకి ప్రవేశించింది ఒక మహిళ. ఆమే ‘మా’ అసోసియేషన్ మహిళా ఆర్టిస్ట్ శ్రీనిజ నాయుడు.
అయితే, కోవిడ్ నిబందనల కారణంగా విష్ణు ప్యానెల్ సభ్యులకి, అతికొద్దిమంది సినీ ప్రముఖులకి, లిమిటెడ్ మీడియాకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు సీనియర్ నటుడు మోహన్ బాబు. న్యూస్ ఛానళ్లకి అయితే అసలు ఎంట్రీనే లేదు. గెలిచిన సభ్యులు కూడా ప్రసిడెంట్ పర్మిషన్ లేకుండా మీడియా ముందుకి వెళ్ళకూడదని హుకుం జారీ చేశారాయన.
దీంతో, లోపలికి ఎవరికీ ఎంట్రన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ నేపధ్యంలోనే శ్రీనిజ నాయుడు కూడా అక్కడికి రావడం జరిగింది. తాను ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాల్సిందే అని పట్టుపట్టింది. కానీ, పోలీసులు ఆమెని భవనం లోపలికి అనుమతించలేదు.
వెంటనే, మీడియాతో మాట్లాడిన ఆమె, తక్షణమే మంచు విష్ణుని ‘మా’ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాక, ప్రకాష్ రాజ్‌కి చాలా అన్యాయం జరిగిందని కూడా ఆరోపించింది. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకుగాను ఆమె మోహన్ బాబుపై నిప్పులు చెరిగారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ… మహిళలకి మీరిచ్చే గౌరవం ఇదేనా! రేయ్ మోహన్ బాబూ! దమ్ముంటే రా చూసుకుందాం. నువ్వో… నేనో… తేల్చుకుందాం అంటూ కొద్దిసేపు వీరంగం సృష్టించింది.