సాదారణంగా పాములనేవి ఏ పొదల్లోనో… గుట్టల్లోనో… కనిపిస్తుంటాయి. చిన్న పాములైతే, ఏ బావుల్లోనో… చెరువుల్లోనో… కనిపిస్తాయి. ఇక పెద్ద పాములైతే అడవుల్లోనో… సముద్రాల్లోనో… కనిపిస్తాయి. కానీ, జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లపై పాములు ఎప్పుడూ కనిపించవు. ఒకవేళ అలా కనిపిస్తే… ఆ పాము అయినా చనిపోతుంది. లేదంటే, మనుషులని అయినా చంపేస్తుంది.
కానీ, ఈ వీడియోలో టోటల్ రివర్స్ జరిగింది. ఇక్కడ పాము ప్రాణాలతో ఆకాశం నుండీ వేలాడుతూ… రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన రద్దీ ఉంది. కానీ, విచిత్రంగా ఎవ్వరికీ ఏమీ కాలేదు.
టాపిక్ లోకి వస్తే, వైరల్ హాగ్ (@ViralHog) అనే వైరల్ వీడియోస్ కంపెనీ అక్టోబర్ 15న ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ భారీ పాము ఆకాశం నుంచి జారి పడింది. అది కూడా రద్దీగా ఉండే ఓ రోడ్డుపై. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు మొదట ఆశ్చర్య పోయారు. ఆ తర్వాత “వామ్మో పాము” అంటూ పరుగులు తీశారు. ఇక కొంతమంది అయితే, ఇదంతా తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశమంతా పాము రాకతో ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది.
నిజానికి ఆ పాము ఆకాశం నుంచి పడలేదు. ఎలా వచ్చిందో తెలియదు కానీ, రోడ్డుపై ఉన్న ఒక తీగకి చుట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంది. అది రాత్రి సమయం కావటంతో, తీగ కనిపించట్లేదు. కేవలం పాము మాత్రమే గాలిలో వేలాడుతూ ఉన్నట్లు కనిపించింది. ఎప్పుడైతే, పాము అలా వేలాడుతూ ఉండడం గమనించారో… అప్పుడు అటుగా వెళ్ళే వాళ్ళంతా ఆగి దానిని వీడియో తీస్తూ ఉన్నారు.
ఇక ఎప్పుడైతే పాము కనిపించిందో… స్నేక్ ప్రొటెక్షన్ సెల్ కి కాల్స్ వెళ్ళిపోయాయి. వైరుకి చుట్టుకున్న ఆ పాము జారి రోడ్డుపై పడినప్పుడు వారు అక్కడే ఉన్నారు. వెంటనే దానిని పట్టుకొని సురక్షిత ప్రదేశానికి తరలించారు. అయితే, ఇదో భారీ కొండ చిలువ అని తెలుస్తోంది.
ఏదేమైనా కానీ, అకస్మాత్తుగా ఆకాశం నుంచి పాము కిందపడితే ఎలాంటి వారికైనా భయమేగా మరి.
A massive snake falling from the sky is my worst nightmare 🐍😨#viralhog #snake #spooktober #nope #nightmarefuel pic.twitter.com/VS9P6q9Spy
— ViralHog (@ViralHog) October 15, 2021