The Man who Confused the Lion

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం…  అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి. రుచిగా ఉన్నామా… లేదా… అని చూడవు. వాటికి కావల్సింది పచ్చి మాంసం మాత్రమే!

ముఖ్యంగా అడవికి రాజైన మృగరాజు విషయంలో కేర్ లెస్ అస్సలు పనికిరాదు.  ఏమాత్రం తేడా వచ్చినా… అది తన పంజా విసురుతుంది. తర్వాత దాని నోటికి పని చెబుతుంది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, అది ఒక జూలాజికల్ పార్క్ అని మాత్రం అర్ధమవుతుంది. అక్కడ జంతువులని విజిట్ చేయడానికి వచ్చిన సందర్శకులు అందరిలానే ఈ వ్యక్తి కూడా వచ్చాడు.  అతను బోనులో ఉన్న సింహం దగ్గరికి వెళ్లి హీరోలా పోజులు కొట్టసాగాడు. 

ఇదంతా ఆ సింహం గమనిస్తూనే ఉంది. అతని ప్రవర్తన దానికి అస్సలు నచ్చలేదు. అందుకే ఇతగాడి వేషాలు చూసి గాండ్రించింది. అయినా మనోడు తగ్గేదే లేదంటూ… దానిని ఇంకొంచెం రెచ్చగొట్ట సాగాడు. అప్పటికీ చూస్తా ఉంది. ఎప్పుడో వీడు నా నోటికి చిక్కకపోడు అని అనుకుంది. ఊహించినట్లే అతను సింహం తలను నిమిరేందుకు బోనులో చేయి పెట్టాడు. అంతే… వెంటనే అది అతడి చేతిని నోటితో పట్టుకొనేసింది. దాని నుంచి విడిపించుకోవటానికి నానావస్థలు పడ్డాడు. బిగ్గరగా అరిచాడు. ఆ కేకలకి అక్కడే ఉన్న సందర్శకుల కేకలు కూడ తోడవటంతో సింహం కాస్త వెనక్కి తగ్గింది. దీంతో దాని నాటినుండీ అతడు తన చేతిని బయటకు తీసుకోగలిగాడు. లేకపోతే అతని చేయి ఆ సింహానికి ఆహారంగా మారేది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top