మనుషులు అనేక రకాలు. కొంతమంది ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుతూ… అందరినీ కలుపుకుంటూ పోతారు. ఇంకొందరు తక్కువగా మాట్లాడుతూ… అతి కొద్ది మందితో మాత్రమే చనువుగా ఉంటారు. మరికొంతమంది రేర్ గా మాట్లాడుతూ… ఎవరితోనూ కలవక తమ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే దాచేసుకుంటారు.
పైన చెప్పిన మొదటి రెండురకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులని పక్కన పెడితే, మూడో రకానికి చెందిన వ్యక్తులు మాత్రం వాళ్ళ మనసులో భావాలని ఎట్టి పరిస్టితుల్లోనూ బయట పెట్టరు. వారికి ఎలాంటి సమస్య ఎదురైనా ఒంటరిగానే ఫేస్ చేయడానికి ట్రై చేస్తారు కానీ, ఇంకొకరికి చెప్పుకోవటానికి మాత్రం ట్రై చేయరు. ఇలాంటి వారికి స్నేహితులు. సన్నిహితులు కూడా తక్కువే! ఆస్ట్రాలజీ ప్రకారం వ్యక్తులు ఇలా ప్రవర్తించటానికి గల కారణం వారి జన్మ రాశులని చెబుతారు ఆస్ట్రాలజర్స్. మరి ఆ రాశులేంటో… అందులో మీరు ఉన్నారో… లేరో… తెలుసుకోండి.
మేషం:
మేషరాశి వారు చాలా ప్రాక్టికల్ పర్సన్స్. వీళ్ళు త్వరగా ఎవరినీ నమ్మరు. వారి భావాలని వ్యక్తం చేయరు. అవతలివారిపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే కొంచెం దగ్గరవుతారు.
మిథునం:
మిథునరాశి వారు అందరితో మాట్లాడినట్లే కనిపిస్తారు. కానీ, వారి రియల్ లైఫ్ సీక్రెట్స్ ని మాత్రం ఎవరికీ చెప్పరు. ఎందుకంటే, తమ వీక్ పాయింట్ తెలిస్తే, అవతలివారిముందు ఎక్కడ చీప్ అయిపోతామోనన్న భయం. అందుకే, ఈ రాశి వ్యక్తులు తమకి ఎవరిపైనైనా కోపం వచ్చినా సరే దానిని ఎప్పుడూ బయట పెట్టరు.
కన్య:
కన్యరాశి వారు తమకి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. గతంలో జరిగిన విషయాలేవైనా సరే మర్చిపోయి ముందుకు వెళతారు. వీళ్ళు తమ ఫీలింగ్స్ మొత్తం తమ మనసులోనే దాచుకోవడానికి ఇష్టపడతారు. అందుకే కన్యారాశి ప్రజలతో మాట్లాడటం చాలా కష్టం.
తుల:
తులారాశి వ్యక్తులు తమ ప్రాబ్లెమ్స్ ని, ఫీలింగ్స్ ని ఇతరులపై మోపడానికి ఇష్టపడరు. వీళ్ళు తమకేం కావాలో తెలిసినప్పటికీ, బయటపడకుండా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఏ విషయాన్ని పట్టించుకోనట్లు ప్రవర్తిస్తారు. కానీ, అన్నీ గమనించుకుంటారు. తమతో సన్నిహితంగా ఉండే వారి దగ్గర మాత్రం ఓపెన్ అవుతారు.
మకరం:
మకరరాశి వారు తాము ఎవరి ముందు వీక్ గా కనిపించకూడదని తమ భావాలను తమలోనే దాచుకొంటారు. కానీ, ఎవరినైనా పూర్తిగా నమ్మితే, కొంతవరకూ తమ విషయాలని షేర్ చేసుకొంటారు.