మనకి తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికతలు ముఖ్యమైనవి. కానీ, మనకి తెలియని అతి పురాతనమైన, శక్తివంతమైన నాగరికత ఒకటి ఉంది. భూమి పుట్టిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి నాగరికతగా దీనిని చెప్తారు. కానీ, అలాంటి నాగరికత గురించి ప్రపంచం రహస్యంగా ఉంచింది. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాగరికతని పరిచయం చేసిన ఆ వ్యక్తి గురించి కూడా చరిత్ర దాచి ఉంచింది. దీనికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ నాగరికత ఏది? దానిని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఈ విషయాలన్నీ చరిత్ర ఎందుకు రహశ్యంగా ఉంచింది? ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
మొట్టమొదటి నాగరికత ఏది? దానిని ఎవరు రాశారు?
భూమి పుట్టగానే ఏర్పడిన మొట్టమొదటి నాగరికత మయన్ నాగరికత. దీనికి ఆధారాలు కూడా లేకపోలేదు. పురాణాల ప్రకారం రామాయణ యుద్ధం జరిగి సుమారు 10 వేల సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దక్షిణ భారత దేశాన్ని శ్రీలంకతో కలుపుతూ ఒక వారధి ఉండేది. దానినే “ఆడమ్స్ బ్రిడ్జ్” లేదా “రామసేతు” అంటారు.
“ఆడమ్” మరియు “ఈవ్” ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవులు. వీళ్ళనుంచే మానవ జాతి పుట్టిందని చెబుతారు. “ఆత్మ” అనే పదం నుంచీ “ఆడమ్”, “జీవం” అనే పదం నుండీ “ఈవ్” పుట్టిందని అంటారు. ఈ విషయాలన్నీ సంస్కృతంలో ఎప్పుడో రాయబడి ఉన్నాయి.
దీన్నిబట్టి చూస్తే, మానవ జాతి పుట్టటానికి ముందే ఈ నాగరికత పుట్టింది. అదికూడా ఆడమ్స్ బ్రిడ్జ్ దగ్గరే పుట్టింది. అక్కడినుండీ ప్రపంచంలోకి విస్తరించింది. అంటే భాష అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ఇక్కడ ఒక మహా నాగరికత పుట్టినట్లు తెలుస్తోంది. ఈ మహా నాగరికతకి ఆద్యుడు మహాముని మాయన్.
సైన్స్ అంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లోనే ఎన్నో ప్రయోగాలు చేశాడాయన. భాష అంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లోనే ఒక భాషని సృష్టించాడు. ఆ భాష పేరే “ప్రోటో ద్రావిడన్”. ఇది తమిళ భాషకి చాలా దగ్గరగా ఉండేది. ఈ భాషలోనే ఆయన “ప్రణవ వేదం” అనే పుస్తకాన్ని రచించారు. మరి ఈ మాయన్ ఎవరో… ఈయన గొప్పతనం ఏమిటో… మానవ నాగరికతకి ఆద్యుడుగా ఎందుకు నిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మాముని మాయన్ ఎవరు?
తమిళ సాహిత్య గ్రంధాల ప్రకారం, మాముని మాయన్ పండితులు మరియు పూజారుల కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఇతని పుట్టుక గురించి పురాణాలు అనేక రకాల కథనాలు చెబుతాయి కానీ సరయిన ఆధారం అయితే లేదనే చెప్పాలి.
అతని కుటుంబీకులు అందరూ విద్యావేత్తలుగా, గొప్ప మేధస్సు కలవారిగా ఉండటం వలన, ఇంకా అతని ఇంటిలో ఎప్పుడూ ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ఉండటం వలన బాల్యంలో అతని ఆలోచనలు కూడా వీటి చుట్టూనే ఉన్నాయి అంటారు.
మాయన్ చిన్న వయస్సు నుండే వేద గ్రంథాలు మరియు నిర్మాణ సూత్రాలపై ఆసక్తిని, లోతైన అవగాహనను సంపాదించాడని చెబుతారు. దీని ప్రభావం యుక్తవయస్సు వచ్చేసరికి వాస్తుశిల్పం మీద ఇంకా అత్యద్భుతంగా భారీ నిర్మాణాల రూపకల్పనపై అతనికి మంచి పట్టు వచ్చేలా చేసింది.
ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు అమెరికాలను కలుపుతూ శ్రీలంక నుండి అంటార్కిటికా వరకు 4500కి.మీ పైగా విస్తరించి ఉన్న లెమురియా ఖండం దీనినే కుమారి ఖండం అని కూడా అంటారు ఈ ఖండంలోని ఇలమూరి దేశంలో ఇతను నివసించినట్లు నమ్ముతారు. కాలక్రమంలో ఈ పెద్ద భూభాగం ముక్కలుగా విడిపోయినప్పుడు ఏర్పడినదే భారతదేశం అని అంటారు.
ఇక మాయన్ ని మాముని మాయన్ అనికూడా పిలుస్తారు. మాముని అంటే తెలుగులో “మహాముని” అని అర్ధం. ఈ మాముని మాయన్ తమిళులకు సంబందించిన వాడు అని చెబుతారు. వారి తమిళ భాష ప్రకారం ఈ మహాముని మాయన్ పేరు వాడుకలో మాముని మాయన్ అయ్యింది. ప్రస్తుతానికి మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం.
తమిళ సాహిత్యంలో మాముని మాయన్ పాత్ర ఏమిటి?
మాముని మాయన్ అనేది తమిళ పురాణాలలో ఒక పాత్ర. తమిళ పురాతన శాస్త్రీయ సంగం సాహిత్యంలోని సిలప్పటికారం, మణిమేకలై ఇంకా సివాక సింతామణి వంటి రచనలలో ఇతని ప్రస్తావన చూడవచ్చు.
అయితే ఇవన్నీ కొట్టిపారేసే విధంగా తమిళ పురాణాలలో, ఇంకా తమిళ సాహిత్యంలో ఉన్న ఒక కల్పిత పాత్ర ఈ మాముని మాయన్. దీనికి మూలం మహాభారత రామాయణ ఇతిహాసాలలో మనకు తెలిసిన మాయాసురుడు అని అంటారు.
ఇది కూడా చదవండి: పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?
మాముని మాయన్ కు మయాసురునికి గల సంబంధం ఏమిటి?
మాముని మాయన్ రాసిన రచనలు, ఇంకా వాస్తు శాస్త్రం అన్నీ మనం మహాభారతం, రామాయణం ఇతిహాసాలలో విన్న మయాసురుడు అనే గొప్ప దైవశిల్పి రాసినవిగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ మయాసురుడే మహాభారతంలో మయసభ కట్టిన గొప్ప దైవశిల్పి. ఇతను రామాయణ కాలంలో రావణాసురుడి భార్య అయిన మండోదరికి తండ్రి.