మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో)

మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరీ చంపారు. ఇదంతా చూస్తూ కూడా అక్కడి జనాలు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు పంజాబ్‌లో.

పంజాబ్‌లోని మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో పనిచేస్తున్న లేబర్ అయిన దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వెంట పడ్డారు. అత్యంత రాద్ద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని వెంటాడారు ఆ గ్యాంగ్. 

అప్పటికీ ఆ యువకుడు  తన దగ్గర ఉన్న కత్తితో వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ, వాళ్ళు అతనిపై మూకుమ్మడిగా దాడి చేయటంతో అతను వెనక్కి అడుగులు వేస్తూ… తట్టుకొని నేలపై పడిపోతాడు. మళ్ళీ తేరుకొని లేచి వాళ్ళని బెదిరిస్తాడు. కానీ, సమయం మించిపోయింది. అతను తరిగి లేచే లోపే వారంతా అతని మీద మీదకి వచ్చేసి తల్వార్లతో విచక్షణా రహితంగా అతనిపై దాడి చేశారు.

ముఖం, మెడ, కాళ్లు, ఇతర భాగాల్లో తల్వార్లతో దాడి చేశారు. ఆ తల్వార్ల దాడికి దేశరాజ్ నేలపై అచేతనంగా  పడిపోయాడు. కొద్దిసేపటికే స్పాట్‌లోనే మరణించాడు. ఇంతా జరిగినా అక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక్క యువకుడ్ని ఆరుగురు దుండగులు కలిసి కత్తులతో ఇష్టమొచ్చినట్లు నరుకుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డు చెప్పలేదు.

కానీ, చివరికి ఒక వృద్ధురాలు మాత్రం ఈ దృశ్యం చూసి చలించి పోయింది. ఆ ముఠాని బెదిరించి పారద్రోలింది. దీంతో వారంతా అక్కడినుండీ పారిపోయారు. అయితే దేశరాజ్‌ను ఆ గ్యాంగ్ చంపటానికి వెనుక ఉన్న అసలు కారణం కొద్ది రోజుల ముందు వారిమధ్య జరిగిన వాగ్వాదమే! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top