చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో)

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఇందుకు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌ యాన్ నగరంలో… బుధవారం మధ్యాహ్నం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, మరియు 14 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు సిచువాన్‌లోని యాన్‌లోని లుషాన్ కౌంటీలో భూకంపం సంభవించింది.

ఈ భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో ఉందని CENC తెలిపింది. భూకంపం సంభవించిన మూడు నిమిషాల అనంతరం యాన్ నగరంలోని బాక్సింగ్ కౌంటీలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. 

ఆ ప్రాంతంలో భూకంపం సంభవించిన తీరు, అక్కడి జనాలు భయంతో పరుగులు తీసిన విధానం ఇవన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రకంపనలు భారీగా రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పాఠశాలల నుంచి పిల్లలు బయటకు పరుగులు తీశారు. షాపింగ్ మాళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. ఇక రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. కొంతమందైతే వాహనాల పైనుండీ పడిపోయారు కూడా. 

మొత్తం మీద చైనా గవర్నమెంట్ అత్యంత వేగంగా స్పందించి, నష్టాన్ని అంచనా వేసింది. ఎమర్జెన్సీ రెస్క్యూ, టీమ్ భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top