చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో)

ఏ తల్లి అయినా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరమే వస్తే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది.  అది మనిషి అయినా సరే! పశువు అయినా సరే!  తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి ఇప్పుడు జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లో ఉన్న డోర్స్ ప్రాంతంలో చునాభతి టీ తోట ఒకటి ఉంది. అక్కడ సుమారు  30-35 ఏనుగులు ఉన్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో ఒక ఒక గున్న ఏనుగు అనుకోకుండా చనిపోతుంది. అయితే, అది ఎందుకు చనిపోయిందో… ఎలా చనిపోయిందో … తెలియదు.

కానీ, ఆ గున్న ఏనుగు తల్లి పడ్డ బాధ మాత్రం వర్ణనాతీతం. చనిపోయిన తన పిల్లని తొండంతో ప‌ట్టుకుని… బాధ కొద్దీ గట్టిగా ఘీంకరిస్తూ… ఒక తోట నుంచి మ‌రోక తోట‌కు నడిచింది. అలా సుమారు బిడ్డను ఎత్తుకుని దాదాపు 7 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించింది.  దాంతోపాటే మిగిలిన ఏనుగుల గుంపు కూడా ఒక తోట నుంచి మరో తోటకు కలిసి ప్రయాణించ సాగాయి.

ఆ ఏనుగుల గుంపు ముందు చునాభటి నుండి బయలుదేరి అంబారీ టీ గార్డెన్, డయానా టీ గార్డెన్, నుడువార్స్ టీ గార్డెన్‌ల ద్వారా రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని ఓ పొద దగ్గర తన పిల్ల‌ మృతదేహాన్ని ఉంచింది. 

అయితే, ఒక్కసారిగా భీకర శబ్ధాలు చేస్తూ… వచ్చిన ఏనుగుల మందను చూసి అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యాయరు. ఆ ఏనుగులు ఏ క్షణంలో ఎలాంటి విద్వంసం సృష్టిస్తాయోనని భ‌య‌ప‌డిపోయారు. తీరా చూస్తే అసలు విషయం ఇది.

ఏదేమైనా తన బిడ్డకోసం ఆ తల్లి పడ్డ బాధ, చూపించిన తెగువ చూస్తే ఎలాంటి వాళ్ళకైనా కన్నీళ్లు ఆగవు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top