NBK 107 Teaser

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో)

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా   జూన్ 10న  అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

తాజాగా విడుదలైన ఈ టీజర్‎లో బాలయ్య గెటప్, డైలాగ్స్ అదిరిపోయాయి. పక్కా మాస్ గెటప్ లో… పులిచర్ల నేపథ్యంలో… పవర్ ఫుల్ యాక్షన్ తో,.. ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఇందులో బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారు. ఇక సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో సెన్సేషన్. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అందిస్తోంది. అయితే, ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top