ఆకతాయి చేసిన వెకిలి చేష్టలకి గొరిల్లా ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా! (వీడియో)

సాదారణంగా మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి కూడా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. దానిని హర్ట్ చేస్తే… లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. సరిగ్గా ఇదే జరిగింది ఓ జూలో. 

జూకి వెళ్లినప్పుడు ప్రతీ చోటా మనం చూస్తుంటాం ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్ ని. కానీ,  కొంతమంది ఆకతాయిలు మాత్రం దానిని పట్టించుకోకుండా జంతువుల ఎన్ క్లోజర్ లోపలి వెళుతుంటారు. ఇంకొంతమందైతే  వాటిని ఎగతాళి చేయటం, భయపెట్టటం వంటివి చేస్తుంటారు. 

ఇండోనేషియాలోని ఓ జూలో ఉన్న గొరిల్లా బోన్ దగ్గరికి ఓ  ఆకతాయి వచ్చాడు.  అతడు సైలెంట్ గా చూసి వెళ్ళిపోకుండా వెకిలి చేష్టలు చేయటం మొదలుపెట్టాడు. దీంతో కొద్దిసేపు ఓర్చుకొంది, ఇక దాని వల్ల కాలేదు. పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ యువకుడి షర్ట్ పట్టుకుని దగ్గరకు లాగుతుంది. మరో వ్యక్తి అతడ్ని రక్షించే ప్రయత్నం చేయాగా అతడిని ఒక్కటి పీకింది. 

ఈసారి ఆ గొర్రిల్లా అతడి కాలు పట్టుకుని తన బోన్‌లోకి లాగే ప్రయత్నం చేసింది. అప్పుడా వ్యక్తి దాని మొండి పట్టుదలకి భయపడిపో సాగాడు. ఎంత గట్టిగా ప్రయత్నించినా ఒదిలిపెట్టలేదు. చివరికి అతని కళ్ళలో పూర్తిగా భయం చూసాక హహ్హ హ్హహ్హ అంటూ నవ్వేసింది. 

దీన్ని బట్టి మీకేం అర్ధమైంది! సహనం చచ్చిపోతే ఎవరైనా కంట్రోల్ తప్పుతారు అని. మొత్తం మీద ఆ గొరిల్లా ఆ వ్యక్తిని బానే కంట్రోల్ లో పెట్టింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top