పిల్లలన్నాక అల్లరి చేస్తేనే ముద్దు. ఒక్కోసారి వాళ్ళు చేసే చిలిపి పనులు కోపం తెప్పించినా… వాళ్ళ ముఖం చూస్తే జాలి వేస్తుంది. ఇక ఈ జనరేషన్ పిల్లలైతే వాళ్ళ అల్లరి చేష్టలతో పెద్దవాళ్ళనే భయపెట్టేస్తున్నారు. మరి ఈ అల్లరి పనులు చేయటం కేవలం మనుషుల్లోనే కాదు, జంతువుల పిల్లలు, పక్షి పిల్లలు ఇలా అన్ని జాతుల్లోనూ చేస్తుంటాయి.
అయితే, ఈ మద్య కాలంలో మొబైల్ ఫోన్ల పుణ్యామా అని ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ని క్యాప్చర్ చేయగలుగుతున్నాం. అలాంటి ఫోటో లేదా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయటం ద్వారా అందరి దృష్టికి చేరుతుంది. ఈ రకంగా చూస్తే మీరే కాదు, మేము కూడా ప్రాంక్ చేయటంలో తగ్గేదేలేదంటూ జంతువులు, పక్షులు కూడా ఈ లిస్ట్ లోకి వచ్చి చేరుతున్నాయి.
రీసెంట్ గా ఒక తెల్లటి పులి పిల్ల ప్రాంక్ చేసి తన తల్లిని భయపెడుతుంది. దానికది ఆటగానే అనిపించినా… తల్లికి మాత్రం ప్రాణ సంకటమైంది. ఇంతకీ ఆ క్యూట్ టైగర్ కబ్ చేసిన చిలిపి పనేంటో తెలుసుకుందామా..!
రాయల్ బెంగాల్ జాతికి చెందిన ఓ తెల్లపులి… దాని ఎన్‌క్లోజర్ బయట ఏదో తింటూ తిరుగుతూ ఉంది. ఆహారం తినే పనిలో పడి అది చుట్టుపక్కల గమనించుకోలేదు. ఇంతలో వెనుక నుంచి సడెన్ గా పులిపిల్ల వచ్చింది. అది కూడా మాములుగా నడుస్తూ రాకుండా… గది లోపలి నుంచి ఒక్కసారిగా ఎగిరి తన తల్లి ముందు దూకింది. దాంతో తనపై ఏదో జంతువు దాడి చేస్తుందనుకుని తల్లి ఉలిక్కిపడింది.
అనుకోకుండా జరిగిన చర్యకి ఉలిక్కిపడిన ఆ పులి భయంతో కింద పడిపోయింది. అది చూసి పిల్లపులి కూడా భయపడి రెండడుగులు వెనక్కి వేసింది. తన తల్లికి కోపం వచ్చిందని గ్రహించి వెంటనే ఏమీ ఎరుగనట్టు మెల్లిగా పక్కకు జారుకుంది.
ఆ పులి పిల్ల చేసిన ప్రాంక్ కి తల్లి పులికి ఎక్కడో కాలింది. కానీ ఏమీ చేయలేక ఊరుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు టైగర్ కబ్ చేసిన చేసిన చిలిపి పనికి కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.
Tiger cub sneaks up on its mom.🐅😅 pic.twitter.com/kn7YsZsMpC
— 𝕐o̴g̴ (@Yoda4ever) February 16, 2022