మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

మనకు సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి వీడియోలు, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. 

సాధారణంగా ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే ఇందులో ఒక పిల్ల ఏనుగు దాని సంర‌క్ష‌కుడితో క‌లిసి ఆడుకుంటున్న హృద‌య‌పూర్వ‌క‌మైన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఈ పిల్ల ఏనుగు దాని సంర‌క్ష‌కుడిని కౌగిలించుకుంటుంది. ప్రేమ‌గా అత‌డిని తొండంతో నిమురుతుంది. దానియొక్క సంర‌క్ష‌క్షుడు కూడా అంతే ప్రేమగా ప‌ట్టుకుని దగ్గరకు తీసుకుంన్నాడు. అతని ముఖంలో సంతోషంతో నవ్వులు చిందించాడు. ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే అతను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘బేబీ ఏనుగు కౌగిలింత’ అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచీ పోస్ట్ చేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top