రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో)

మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌ తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ కోవిడ్‌కు పాజిటివ్‌గా తెలిందీ దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ సమయంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్ అందించింది. రోహిత్ ఏం చేస్తున్నాడంటూ సమైరాను యూకేలో విలేకరీ ప్రశ్నించాడు. కాగా, సమైరా చెప్పిన సమాధానం ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా. తన తండ్రి రూమ్ లో  విశ్రాంతి తీసుకుంటున్నాడంటూ చాలా క్యూట్‌గా సమైరా సమాదానం చెప్పింది. సమైరా రోహిత్‌కి సంబంధించిన వీడియో అప్‌డేట్‌ను అభిమానులకు ఎంతగానో నచ్చింది. దీంతో సమైరా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకునరు.

ఇటీవల లీసెస్టర్‌షైర్‌తో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ జట్టులో ఒక భాగమయ్యాడు. ఆట చివరి రోజున కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినందున అతను ఆడలేదు. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెలెక్టర్ చేతన్ శర్మ యూకే చేరుకోనున్నందున, రాబోయే టెస్ట్‌లో టీమిండియాకు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై నేడు నిర్ణయం తీసుకోబోతునట్లు  తెలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top